Header Banner

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా జాబ్ మేళా - 1000 పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూలు ఎక్కడంటే..

  Sat May 24, 2025 16:34        Employment

విశాఖపట్నం జిల్లాలో నిరుద్యోగ యువతకు మరోసారి ఉద్యోగావకాశం కలిగించేందుకు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ముందుకొచ్చింది. మే 26న సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీ గౌరీ డిగ్రీ, పీజీ కళాశాల, ఊర్వశి జంక్షన్, కంచరపాలెం లో మెగా జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఐటీఐ, డిప్లొమా, బి/డి/ఎం ఫార్మసీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల కోసం సుమారు 1000కు పైగా ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం తో పాటు విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి.

 

ఇది కూడా చదవండి: బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..

 

 ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.10వేల నుంచి రూ.30వేలు మధ్య వేతనాలు లభిస్తాయని తెలిపారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు 8712655686, 8790118349, 8790117279, 9948768778, 9959377669 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే www.naipunyam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిట్ కార్డుతో జాబ్ మేళాకు హాజరుకావచ్చని సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన మెగా జాబ్ మేళాల ద్వారా అనేకమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని అధికారులు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యానికి అనుగుణంగా ఉద్యోగం పొందవచ్చని సూచించారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JobMall #ANdhraPradesh #Srikakulam